5 గంటలు ఏఐ క్లాసులు ఉండాలి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్

5 గంటలు ఏఐ క్లాసులు ఉండాలి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్​స్కూళ్లలో సీ గ్రేడ్​విద్యార్థుల కు చెప్తున్న ఏఐ క్లాసులు రోజుకు 5 గంటలు ఉండాలని హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్​టీచర్లకు సూచించారు. సికింద్రాబాద్ లాలాపేట గవర్నమెంట్ స్కూల్​ను సోమవారం ఆయన  సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్, ఏఐ, ఏఎక్స్ఎల్ ల్యాబ్  ను తనిఖీ చేశారు. 

డీఈఓ ఆర్.రోహిణి, డిప్యూటీ డీఈఓ బాలు నాయక్, హెచ్ఎం రమణమ్మ పాల్గొన్నారు. మెహిదీపట్నం  సఫ్దరియా బాలికల స్కూల్​లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు కండ్లద్దాలు అందించారు. కలెక్టర్​తోపాటు డీఎం హెచ్ఓ డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.