- మేం ఎటువంటి ప్రకటన విడుదల చెయ్యలే
- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: కొత్త మీ సేవ సెంటర్ల ఏర్పాటు పేరుతో వచ్చిన ప్రకటన ఫేక్ అని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కొత్త మీ సేవ సెంటర్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదన్నారు.
కొంతమంది సైబర్ కేటుగాళ్లు మీ సేవ సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం పేరిట ఫేక్ వెబ్సైట్ క్రియేట్చేసినట్లు తెలిపారు. ఇది అచ్చంగా అధికారిక మీ సేవ వెబ్‌సైట్‌కు ప్రతిరూపంగా ఉందన్నారు. అందులో వచ్చే ఎటువంటి ప్రకటనలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. జిల్లా పరిపాలన శాఖ ద్వారా జారీ చేయబడిన సమాచారాన్ని మాత్రమే అనుసరించాలన్నారు.