అంగన్​వాడీ సెంటర్లను విజిట్​ చేయండి : కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి

అంగన్​వాడీ సెంటర్లను విజిట్​ చేయండి : కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి
  • సూపర్​వైజర్​, సీడీపీవోలకు కలెక్టర్​ సూచన

 హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రతి సూపర్​వైజర్​నెలకు 15 అంగన్​వాడీ సెంటర్లను, సీడీపీవో 10 సెంటర్లను తప్పక విజిట్​చేయాలని కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ పథకాలపై బుధవారం ఆయన సమీక్ష జరిపారు. పిల్లల హాజరు శాతం తక్కువగా ఉన్న సెంటర్ల టీచర్లు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు.సికింద్రాబాద్, కంటోన్మెంట్ ఏరియాతో పాటు మరికొన్ని కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం పెంచాలని, లేకపోతే  యాక్షన్​తప్పదని హెచ్చరించారు. 

కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు పర్మిషన్లు తీసుకోవాలని, విద్యుత్ సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు. పోషణ పక్షం గోడపత్రిక ఆవిష్కరించి, వారోత్సవాలను  విజయవంతం చేయాలని కోరారు. డీడబ్ల్యూఓ అక్కేశ్వర్​రావు, డీఐఓ డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.