
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ శుక్రవారం రాత్రి షేక్ పేటలోని గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. టెన్త్, ఇంటర్ స్టూడెంట్లతో మాట్లాడారు. భోజనం, వసతి, విద్యా బోధన, మెనూ గురించి తెలుసుకున్నారు. రాత్రికి స్టూడెంట్లతో కలిసి హాస్టల్లోనే నిద్రపోయారు.
అలాగే విమెన్ అండ్చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్ పల్లి తారా హోంలో శుక్రవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. జిల్లాలోని 57 చైల్డ్‌కేర్, 7 డిజేబుల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్ల నుంచి 800 స్టూడెంట్లు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. కలెక్టర్అనుదీప్పరిశీలించి స్టూడెంట్లను అభినందించారు. – వెలుగు, హైదరాబాద్ సిటీ