హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. గురువారం కలెక్టరేట్ లో వివిధ పార్టీల ప్రతినిధులు, ఏఆర్ఓలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 18 నుంచి 25 వరకు కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సీరియస్యాక్షన్ఉంటుందన్నారు. సభలు, సమావేశాలు, అడ్వటైజ్మెంట్ల కోసం 48 గంటల ముందు అప్లికేషన్పెట్టుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగితే 1950 నంబర్‌కు, సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పి.నాగేశ్వర్, సత్యనారాయణ, ఎం.మీనా, వి.ఎస్.భరద్వాజ, యమన్ సింగ్, కొల్లూరు పవన్ కుమార్, బీఆర్ఎస్ గగన్ యాదవ్, కాంగ్రెస్ పి.రాజేశ్‌కుమార్, బి సతీశ్‌గౌడ్, ఏఆర్ఓలు పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గురువారం ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్పాల్గొన్నారు. డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని చెప్పారు. శిక్షణకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కు 15వ తేదీలోపు అప్లై చేసుకోవాలని కలెక్టర్సూచించారు.