క్లీన్​గా ఉంచకుంటే సీరియస్ ​యాక్షన్.. కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్​ను క్లీన్​గా ఉంచకుంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. బుధవారం ముషీరాబాద్ లోని జమిస్తాన్ పూర్, అడ్డగుట్ట ప్రభుత్వ ఎస్సీ గర్ల్స్​హాస్టల్​ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనంగా ఉన్న బెడ్లు, మ్యాట్రెస్ ను తొలగించాలని సూచించారు.

హాస్టల్ మొత్తాన్ని క్లీన్​చేయాలని, చెత్త నిల్వలు పేరుకుపోయేలా చేయొద్దని హెచ్చరించారు. జమిస్తాన్ పూర్ హాస్టల్ సంక్షేమ అధికారి భానుప్రియ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి శాంతి, ఏఎస్ డబ్ల్యూ ఓ, అడ్డగుట్ట మల్లుకు షోయాజ్ నోటీసులు జారీ చేశారు.