ముషీరాబాద్, వెలుగు: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నా పారిశుధ్య నిర్వహణ పట్టదా? అని జీహెచ్ఎంసీ సర్కిల్ 15 అధికారులపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మండిపడ్డారు. ఫాగింగ్, పారిశుధ్య పనుల తీరును రాంనగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీ, అజామాబాద్ ప్రాంతాల్లో బుధవారం పరిశీలించారు.
ఎస్ఆర్టీ కాలనీ సమీపంలో నిల్వఉన్న నీరు, వ్యర్థాలను చూసిన ఆయన ‘ఇలా ఉంటే వ్యాధులు రావా?’అని డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మోహినుద్దీన్, సహాయ వైద్య అధికారి హేమలతను ప్రశ్నించారు. ఎక్కడా చెత్త పేరుకుపోవడానికి ఆస్కారం ఇవ్వవొద్దని, నిర్లక్ష్యం వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.