పాప దత్తత విషయంలో సినీ నటి కరాటే కళ్యాణికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామన్నారు హైదరాబాద్ కలెక్టర్ శర్మన్. అయితే ఇప్పటివరకు ఆమె నుంచి ఎలాంటి రిప్లై రాలేదని చెప్పారు. మరోసారి నోటీస్ జారీ చేస్తామని, ఆ తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలను దత్తతు తీసుకోవాలంటే కొన్న రూల్స్ ఉంటాయని..దాని ప్రకారమే దత్తత తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ దత్తత ఇల్లీగల్ అని తేలితే మూడేళ్ల పాటు శిక్ష ఉంటుందన్నారు. కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఆమె ఇంట్లో వుంటున్న చిన్నారి ఎవరన్న దానిపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు.
కాగా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కల్యాణి దాడి చేసింది. ప్రాంక్ వీడియోలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఇరువురు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఒకరిపైఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా..పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మరిన్ని వార్తల కోసం
తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!
బ్యాంక్ చోరీ కేసులో కొత్త ట్విస్ట్..కోర్టులో ప్రత్యక్షం