- పండుగలు, ఉత్సవాల టైంలో సిటీలో విద్యుత్ధగధగలు
- వందల కోట్లు కావడంపై కమిషనర్‌కు డౌట్
- వివరాలు సమర్పించాలని ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో పలు పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే టెంపరరీ లైటింగ్ విషయంలో భారీగా అవినీతి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేండ్లలో వీటి కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయడంపై కమిషనర్ ఇలంబరితి ఆరా తీస్తున్నారు.
జోన్, సర్కిల్, వార్డుల వారీగా పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించినట్లు సమాచారం. రిపబ్లిక్‌డే, బోనాలు, బతుకమ్మ, తెలంగాణ ఫార్మేషన్డే, ఇండిపెండెన్స్ డే, తెలంగాణ వన్ రైజింగ్ ఉత్సవాలు, గణేశ్, బతుకమ్మ నిమజ్జనాలు, దసరా సమయాల్లో బల్దియా హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసులు, పలు జంక్షన్లు, పలు ఫ్లైఓవర్లపై బల్దియా టెంపరరీ లైటింగ్ ఏర్పాటు చేస్తోంది.
ఒకటి, రెండు రోజుల నుంచి మొదలుకుంటే 9 రోజుల వరకు కలర్ఫుల్లైట్లను వెలిగిస్తోంది. అయితే ఇందుకోసం రూ.500 కోట్లు ఖర్చు కావడంపై కమిషనర్అనుమానం వ్యక్తం చేస్తూ వివరాలు కోరినట్లు తెలిసింది. నెల కిందటే వివరాలు కోరినా పంపకపోవడంతో సీరియస్ అయినట్టు సమాచారం. పూర్తి వివరాలు పరిశీలించి విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం.