తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ లో 2 లక్ష వాహనాలను చెక్ చేశామని నగర కమిషనర్ సందీప్ శ్యాండిల్య తెలిపారు. 2023, నవంబర్ 28వ తేదీ ఎన్నికల ప్రచారం ముగినసిన తర్వాత కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నాయకులు హైదరాబాద్ కు వచ్చారని అన్నారు. హైదరాబాదులో 2400 మందిని బైండోవర్ చేశామని చెప్పారు. నగరంలో ఉన్న 7 జోన్ లలో 1600 మంది రౌడీ షీటర్లు ఉన్నారని.. ప్రతి రోజు రౌడీ షీటర్లపై దృష్టి పెట్టామని తెలిపారు.
48 గంటల పాటు పోలీసులు చాలా అలెర్ట్ గా ఉండాలని చెప్పారు. నగరంలో 2 లక్ష వాహనాలు చెక్ చేశామని.. ప్రతి ఒక్కరూ సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ నాయకులు ఏదైనా సమస్య సృష్టిస్తే వెంటనే పబ్లిక్ డయల్ 100 కు కాల్ చేయండని అన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.
హైదరాబాద్ లో 666 సున్నిత ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. 370 మొబైల్ యూనిట్ లు విధుల్లో ఉన్నాయని తెలిపారు. పోలీసుల ఏదైనా తప్పు చేస్తే.. వెంటనే డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read :- హైదరాబాద్ లో 2లక్షల వాహనాలు చెకింగ్: సందీప్ శ్యాండిల్య