ఉత్పత్తి పెంపునకు రూ.230 కోట్లు

ఉత్పత్తి పెంపునకు రూ.230 కోట్లు
  •     ప్రకటించిన గ్రీన్​ప్యాక్​ 

హైదరాబాద్,  వెలుగు: గ్లాస్​ ప్రొడక్టులను తయారు చేసే హైదరాబాద్​ కంపెనీ  ఏజీఐ గ్రీన్​ప్యాక్​ దాని ప్రస్తుత ఫర్నేస్‌‌లను ఆధునీకరించడానికి,  ఉత్పత్తిని పెంచడానికి రూ.230 కోట్లు ఇన్వెస్ట్​ చేయనున్నట్టు ప్రకటించింది. సంస్థ సీఈఓ రాజేశ్​ఖోస్లా బుధవారం భువనగిరి ప్లాంటులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాది తమకు రూ.2,421 రెవెన్యూ, రూ.600 కోట్ల ఎబిటా వచ్చాయని చెప్పారు.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. ‘‘ గ్లోబల్ గ్లాస్ ప్యాకేజింగ్ మార్కెట్ ఈ ఏడాది  67.28 బిలియన్ల డాలర్ల నుంచి 2032 నాటికి 93.69 బిలియన్ల డాలర్లకు చేరుకుంటుంది. మనదేశంలో రోజుకు 11 వేల టన్నుల గ్లాస్​ప్యాకేజింగ్​ ప్రొడక్టులు తయారవుతున్నాయి. డిమాండ్​కూడా అంతే ఉంది.  మాకు దేశవ్యాప్తంగా ఏడు ప్లాంట్లు ఉన్నాయి.  భువనగిరి ప్లాంటు కెపాసిటీ రోజుకు 154 టన్నులు. మేం కొత్తగా యాంటీ డిప్రెషన్​, యాంటీ బ్యాక్టీరియా బాటిల్స్​కూడా తయారు చేస్తున్నాం. మా ప్రొడక్టులను చాలా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం”అని ఆయన వివరించారు.