ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ ధర రూ.450

ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ ధర రూ.450

న్యూఢిల్లీ: సోలార్ సెల్స్ తయారు చేసే హైదరాబాద్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరుని రూ.427–450 రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మనుంది. కంపెనీ ఐపీఓ ఈ నెల 27న ఓపెనై, 29 న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం  ఈ నెల 26 న ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.  2,830 కోట్లు సేకరించాలని ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాన్ చేస్తోంది.  

ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.1,291.4 కోట్లను సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) షేర్ హోల్డర్లు 3.42 కోట్ల విలువైన షేర్లను అమ్మనున్నారు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద వీటి వాల్యూ రూ.1,539 కోట్లు. ఓఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కింద సౌత్ ఏషియా గ్రోత్ ఫండ్ 2 హోల్డింగ్స్ 2.68 కోట్ల షేర్లను, సౌత్ ఏషియా ఈబీటీ 1.72 లక్షల షేర్లను, ప్రమోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిరంజీవ్ సింగ్ సలూజా 72 లక్షల షేర్లను అమ్మనున్నారు.