మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా..? : టోల్ ట్యాక్స్ బాదుడుకి.. రూ.35 వేల జరిమానా

నిర్ణయించిన చార్జ్​కంటే అదనంగా రూ.80 టోల్​ట్యాక్స్​వసూలు చేసిన టోల్​ఆపరేటర్​ గోల్కొండ ఎక్స్​ప్రెస్​వే, హెచ్ఎండీఏ సంస్థలకు హైదరాబాద్​జిల్లా కన్జ్యూమర్​కమిషన్​రూ.35వేలు ఫైన్​విధించింది. రామాంతపూర్ కు చెందిన గుమ్మి రాజ్ కుమార్ గతేడాది నవంబర్11న రాత్రి కారులో ఘట్​కేసర్​వద్ద ఓఆర్ఆర్​ఎక్కాడు. కీసర వద్ద ఎగ్జిట్​అయ్యాడు. టోల్​ట్యాక్స్​కింద రూ.20 కట్​అయింది. 

రాజ్​కుమార్​5 గంటల లోపే తిరుగు ప్రయాణయ్యాడు. రిటర్న్​లో మాత్రం టోల్​ట్యాక్స్​కింద రూ.90 కట్​అయింది. అయితే 5 గంటల లోపు తిరిగి ఓఆర్ఆర్​ఎక్కితే కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.  కానీ రూ.80 అదనంగా వసూలు చేశారు. ఇదేమిటని ఓఆర్ఆర్ టోల్ ఫ్రీ నంబర్14449కు కాల్ చేస్తే పనిచేయలేదు. ఫాస్ట్ ట్యాగ్ తో టై అప్ అయిన ఐడీఎఫ్సీ బ్యాంక్ కు మొబైల్ యాప్ ద్వారా కంప్లైంట్ చేస్తే రెస్సాన్స్​రాలేదు. 

విసిగిపోయిన రాజ్​కుమార్​హైదరాబాద్​జిల్లా కన్జ్యూమర్​కమిషన్ ను ఆశ్రయించాడు. తాజాగా టోల్ ఆపరేటర్ గోల్కొండ ఎక్స్ ప్రెస్ వే, హెచ్ఎండీఏ సంస్థలకు సంయుక్తంగా రూ.30 వేలు జరిమానా విధించింది. అలాగే కోర్టు ఖర్చుల కింద ఫిర్యాదుదారుడికి45 రోజుల్లో  రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించింది.