ఇయ్యాల ( జూలై 28)న పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం కూడా అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ ప్రకటించింది. 

ఆయా జిల్లాల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదు కావొచ్చని హెచ్చరించింది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్​, మేడ్చల్​, మల్కాజిగిరి, వికారాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను ఇచ్చింది.

ALSO READ:ఊర్లకు ఊర్లే మునిగినయ్​..  ముంచెత్తిన వరద.. ఉప్పొంగిన వాగులు

 హైదరాబాద్​కు కూడా అతిభారీ వర్షం ఉందంటూ ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టొచ్చని చెప్పింది.