హైదరాబాద్: 2024లో క్రైం రేటు పెరిగినా.. ఈ ఏడాది ప్రశాంతంగా నే ముగిసిందన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఆదివారం (డిసెంబర్ 22) సాయంత్రం కమిషనరేట్ పరిధిలోని 2024 యాన్వువల్ క్రైం రిపోర్డును వెల్లడించారు. నేర కట్టడికి హోం గార్డు నుంచి సీపీ వరకు అందరూ బాగా కష్టపడ్డారని పోలీసు సిబ్బందిని అభినందించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను కూడా విజయవంతం పూర్తి చేసినట్లు సీపీ చెప్పారు.
ఫిర్యాదు అందిన ఏడు నిమిషాల కన్నా తక్కువ సమయానికి ఘటనా స్థలానికి చేరుకుంటున్నట్లు సీపీ చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 129 పెట్రోల్ కార్లు, 210 బ్లూ కోల్ట్స్ , ఇంటర్ సెట్టర్ వెహికల్స్ విజిబుల్ పోలిసింగ్ ఓ భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు.
2024 నమోదైన కేసులు..
- 2024లో మొత్తం 35,944 ఎఫ్ఐఆర్‌లు
- గతేదాడి కంటే ఈసారి 45 శాతం ఎఫ్ఐఆర్‌లు
- హత్యలు 13 శాతం తగ్గాయి, హత్యాయత్నం కేసులు
- కిడ్నాప్ కేసుల్లో 88 శాతం పెరుగుదల
- ఆస్తికి సంబంధించిన నేరాల్లో 67 శాతం పెరుగుదల
- నేరాలు డిటెక్ట్ 59 పర్సంటేజ్ , 58 శాతం రికవరీ
- ఈ ఏడాది 36 రకాల సైబర్ నేరాలు
- డిజిటల్ అరెస్టులు అత్యధికం నమోదు
- 4,042 సైబర్ నేరాలు నమోదు
- ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ కేసులూ ఎక్కువే
రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో ప్రజలు పోగొట్టుకున్నారు.. ఆ నగదులో రూ.42 కోట్లు రికవరీ చేశాం. సైబర్ నేరాల్లో 30 శాతం కేసు డిటెక్షన్ పెరుగుదల కనిపించింది.. 500 మంది కన్నా ఎక్కువ సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
బ్యాంకింగ్ లోపాలు బ్యాంకర్ల పాత్రపైనా పూర్తిస్థాయి ఫోకస్ పెడతాం.. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతాం.. నార్కోటిక్ బ్యూరో322 కేసులు,13.5 కోట్ల విలవైన డ్రగ్స్, 2,208 మంది పోకిరీలను షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా జరిగింది. 250 కేసులు సీసీఎస్ ద్వారా నమోదు చేశామన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.