హోలీ పండుగ..హైదరాబాదీలకు సీపీ సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్

హోలీ పండుగ..హైదరాబాదీలకు సీపీ సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్

హైదరాబాదీలకు పోలీసుల మాస్ వార్నింగ్.. మార్చి 14న  హోలీ పండుగ  సందర్భంగా ఎవరిమీద పడితే వాళ్లమీద రంగులు చల్లడం..ఇష్టం వచ్చినట్లు రోడ్లమీద తిరగడం చేయకండి.. హోలీ రోజు  పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని..ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.

Also Read :- దేశం మొత్తం సెలవు.. లిక్కర్, బ్యాంకులు, స్కూల్స్ అన్నీ బంద్

తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు  తీసుకుంటామని   సీపీ సివీ ఆనంద్ అన్నారు.  హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని హెచ్చరించారు.  రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్లిక్ వెళ్లే రోడ్స్ పై రంగులు చల్లుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు.  బైక్స్, ఇతర వాహనాలతో గుంపులుగా తిరగొద్దన్నారు.  మార్చి 13 సాయంత్రం 6 గంటల నుంచి 15 ఉదయం 6 గంటల  వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు సీపీ సీవీ ఆనంద్.