సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్నాడని, రికవరీ కావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. అందువలన ట్రీట్ మెంట్ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి రెండు వారాలు అవుతుందని, ప్రభుత్వం తరఫున హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా తో కలిసి శ్రీతేజ్ ను పరామర్శించినట్లు ఆయన తెలిపారు. త్వరలో శ్రీ తేజ్ ఆరోగ్యం పై వైద్యులు బులెటిన్ విడుదల చేస్తారని సీపీ ఆనంద్ తెలిపారు.
ALSO READ | 13 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
తెలంగాణ హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా మాట్లాడుతూ.. శ్రీ తేజ్ ట్రీట్మెంట్ గురించి మానిటర్ చేస్తున్నామని అన్నారు. వైద్యులను ఎప్పటికప్పుడు అడిగి పరిస్థితిని తెలుసుకుంటున్నామని, శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.