ఈ సారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయ్: సీపీ ఆనంద్

ఈ సారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయ్: సీపీ ఆనంద్

ఈ  సారి 24 శాతం సైబర్ నేరాలు పెరిగాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. బాగా చదువుకున్న వాళ్లే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని చెప్పారు. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయన్నారు.  ఎన్నో సమస్యల మధ్య సైబర్ నేరగాళ్లను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు.. దాదాపు 36 కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చామని చెప్పారు ఆనంద్. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ లు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వార్షిక సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమావేశా జరుగుతోంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ  మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ బ్రిజేష్ సింగ్, సిపి ఆనంద్, సిఐడి చీఫ్ శిఖా గోయల్ పాల్గొన్నారు.  

సైబర్ రంగ నిపుణులు మేధావులతో సైబర్ నేరాలపై ఈ కార్యక్రమంలో లోతుగా చర్చించారు.  సైబర్ భద్రతతో పాటు సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి వ్యూహాలు,  పెరుగుతున్న సైబర్ బెదిరింపులు , సైబర్ భద్రతలో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై చర్చించారు నిపుణులు.  డిజిటల్ భద్రతపై ఆయా రంగాలోని ప్రముఖులతో హ్యక్ సమ్మిట్ లో అవగాహన కల్పించారు.  లేటెస్ట్  సైబర్‌ సెక్యూరిటీ సాధనాలు, సైబర్ నేరాలు ఎలా ఎదుర్కోవాలనేదానిపై చర్చించారు.