కొవిడ్ తర్వాత హార్ట్ స్ట్రోక్స్ పెరిగాయి : సీవీ ఆనంద్

కొవిడ్ తర్వాత హార్ట్ స్ట్రోక్స్ పెరిగాయి :  సీవీ ఆనంద్
  • సిటీ సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీ: కొవిడ్ తర్వాత హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువయ్యాయని, సీపీఆర్ మీద అవగాహన ఉండాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. సిటీ పోలీస్, మైత్రి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్​ సీసీసీ​లో సీపీఆర్​అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. 

నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని  సీపీ ఆనంద్ ప్రారంభించారు. జిమ్​చేసేవారు కూడా స్ట్రోక్స్​ బారిన పడుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా డెయిలీ 1.15 లక్షల మంది గుండెపోటుతో చనిపోతున్నారని, సీపీఆర్ ​నేర్చుకుంటే కొంతమందినైనా కాపాడొచ్చన్నారు.