8 మంది ఎస్సైలపై సస్పెన్షన్​ ఎత్తివేత

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణ చర్యల కింద ఈ ఏడాది సస్పెండ్ అయిన 18 మందికి చెందిన పూర్తి వివరాలను సిటీ సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. వారిచ్చిన వివరణ,స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్ ఆధారంగా 8 మంది ఎస్సైలు సహా మొత్తం 18 మందిపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి జులై వరకు సస్పెండైన వారిలో 8 మంది ఎస్సైలు, ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మినీస్టీరియల్‌ స్టాఫ్‌ ఉన్నారు. వీరి సస్పెన్షన్‌  ఎత్తివేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.