పబ్లిక్‎ను టచ్ చేస్తే తాట తీస్తాం: బౌన్సర్లకు సీపీ ఆనంద్ వార్నింగ్

 పబ్లిక్‎ను టచ్ చేస్తే తాట తీస్తాం: బౌన్సర్లకు సీపీ ఆనంద్ వార్నింగ్

హైదరాబాద్: సెలబ్రెటీలకు కాపలాగా ఉండే ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనపై 2024, డిసెంబర్ 22న సీపీ సీవీ ఆనంద్ మినిట్ టూ మినిట్ వీడియో రిలీజ్ చేసి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లను తోసేసిన, వారిపై చెయ్యి వేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. అలాగే పబ్లిక్‎ను పక్కకు తోసేసినా తాట తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ALSO READ | డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర అసలేం జరిగింది..? మినిట్ టూ మినిట్ వీడియో రిలీజ్ చేసిన సీపీ

బౌన్సర్‎లను సప్లై చేసే ఏజెన్సీలకు కూడా వార్నింగ్ ఇస్తున్నా.. ఏదైనా ఇష్యూ జరిగితే బౌన్సర్‎ల బాధ్యత ఆ ఏజెన్సీస్‎తో పాటు బౌన్సర్లను నియమించుకున్న వీఐపీపైన కూడా ఉంటుందని స్పష్టం చేశారు. బౌన్సర్‎ల విషయంలో చాలా సీరియస్‎గా వెళ్తామని.. మాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యమని అన్నారు. కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ బౌన్సర్లు పబ్లిక్ ను పక్కకు తోసేయడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు  తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. ఈ నేపథ్యంలోనే బౌన్సర్లకు సీపీ మాస్ వార్నింగ్ ఇచ్చారు.