హైదరాబాద్, వెలుగు : రంజీ ట్రోఫీ మ్యాచ్‌లను హైదరాబాద్‌తో పాటు వరంగల్ లోనూ నిర్వహించేందుకు కృషి చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు చెప్పారు. వరంగల్ నగరంలో క్రికెట్ స్టేడియం నిర్మించే విషయంపై తమ అపెక్స్ కౌన్సిల్‌లో చర్చిస్తామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో హెచ్‌సీఏ నిర్వహించిన సమ్మర్ క్రికెట్ క్యాంప్స్ సోమవారం ముగిశాయి. వరంగల్‌లో జరిగిన ముగింపు వేడుకలకు హెచ్‌సీఏ అపెక్స్ సభ్యులతో హాజరైన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,500 మంది కోచింగ్ ఇచ్చామన్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో స్టేట్‌లెవెల్ టీ20 క్రికెట్ టోర్నీ నిర్వహించి ప్రతీ జిల్లా జట్టును ఆడిస్తామన్నారు.