త్రిషా, ధ్రుతికి ఘన స్వాగతం

త్రిషా, ధ్రుతికి ఘన స్వాగతం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: ఐసీసీ అండర్‌‌‌‌‌‌‌‌–-19 టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటిన గొంగడి త్రిష, కేసరి ధ్రుతికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు అరశనపల్లి జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ రావు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం శంషాబాద్‌‌‌‌‌‌‌‌ విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఇద్దరిని జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ రావు సత్కరించారు. 

దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన త్రిషాను ప్రత్యేకంగా అభినందించారు. త్రిషా, ధ్రుతిను ఆదర్శంగా తీసుకుని మరింత మంది మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. త్వరలో అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో చర్చించి నగదు బహుమతి ప్రకటిస్తామని వెల్లడించారు.