Ramadan: హైదరాబాదులో ప్రవక్త ఆస్వాధించిన రుచులు.. రంజాన్ ఉపవాసాలకు స్పెషల్ వంటలు

Ramadan: హైదరాబాదులో ప్రవక్త ఆస్వాధించిన రుచులు.. రంజాన్ ఉపవాసాలకు స్పెషల్ వంటలు

Hyderabad Food: హైదరాబాద్ అనగానే ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ లవర్స్ కి గుర్తొచ్చేది బిర్యానీ. అదే రంజాన్ మాసంలో హైదరాబాదీ హలీమ్ కూడా ఎక్కువగా ఆదరణను పొందుతోంది. రంజాన్ ఉపవాసాన్ని సాయంత్రం సూర్యాస్థమయం ప్రార్థనకు పిలుపుతో పాతబస్తీ, చార్మినార్ ప్రాంతంలో ప్రజలు క్యూకడతారు. నీరు తాగి ఇఫ్తార్ విందుకు సిద్ధమవటం అక్కడ కనువిందు చేస్తుంది.

అయితే ప్రస్తుతం హైదరాబాదీలు మెుహమద్ ప్రవక్త 14 వందల ఏళ్ల నాడు ఆస్వాధించిన అదే రుచులతో రంజాన్ ఉపవాసాలను పూర్తి చేస్తున్నారు. వారసత్వంగా వస్తున్న తరీద్, తల్బినా , నబీజ్, హరీస్ వంటి వంటకాలను ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నాయి. ఒకప్పుడు ఇవి కేవలం ఇళ్లలో వంటగదికి మాత్రమే పరిమితమయ్యేవి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ వంటకాలు ప్రస్తుతం హైదరాబాదులో ప్రాచుర్యం పొందటంతో రోడ్డు పక్కన ఉండే చిన్న స్టాల్స్ నుంచి హైఎండ్ రెస్టారెంట్ల వంటి చోట్ల కూడా లభిస్తున్నాయి. 

6వ శతాబ్దపు అరబిక్ సంప్రదాయాల్లో పాతుకుపోయిన ఈ ఆహారాలు.. హైదరాబాదీ వంటకాలను రూపొందించిన మొఘల్, నిజాం కాలం నాటి ప్రభావాలకు ముందే ఉన్నాయి. అయితే ఈ వంటకాలు నగరంలోని ఇఫ్తార్, సుహూర్ మెనూలోకి ఎలా వచ్చాయనే ప్రశ్న ఉంది. ప్రస్తుతం దశాబ్ధాల నాటి ఈ ఆహారాలు ఎక్కువగా ప్రజాధరణను అందుకోవటానికి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందని సామాజిక కార్యకర్త జాకీర్ హుస్సేన్ అన్నారు. ఈ వంటకాల్లో బార్లీ, ఖర్జూరం, తేనె వంటి ఆరోగ్యకమైన పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

ALSO READ :  వారంలో రెండు సార్లు కచ్చితంగా బీన్స్ తినాలా

ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సయ్యద్ మోజ్జమ్ సూర్యోదయానికి ముందు పబ్లిక్ గార్డెన్స్‌లో ఒక చిన్న కౌంటర్‌ను ఏర్పాటు చేసి, తెల్లవారుజామున భోజనం కోసం ఉదయాన్నే లేచేవారికి తన తల్లి వండిన తల్బినాను వడ్డిస్తున్నారు. దీనితో పాటు అతడు ప్రజలకు నబీజ్ కూడా అందిస్తున్నారు. ఇవి న్యాచురల్ ఆరోగ్యకరమైన దశాబ్ధాల నాటి ఆహారంగా ఆయన చెబుతున్నారు. ఉపవాసం ఉన్న ముస్లింలు, ఫిట్‌నెస్ ప్రియులు, ఉదయం నడక ఆసక్తి ఉన్నవారు, ఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ అన్వేషకులు అతని కస్టమర్లు. పైగా తల్బినా మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచిదని చెబుతున్నారు. 

ప్రవక్త ఆరాగంలో సహజమైన ఆహార పదార్థాలైన బార్లీ, గోధుమలు, ఖర్జూరాలు, పాలు, వెనన్న, మేక లేదా ఒంటె వంటి మాంసాలతో కూడినవి ఉంటాయి. ప్రవక్తకు ఇష్టమైన బార్లీ ఆధారిత గంజి అయిన తల్బినాను ఒంటె పాలు, తేనె లేదా వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌తో వడ్డిస్తారు. అయితే జ్యూస్ వ్యాపారి అబ్దుల్ ఖాదర్ ఈ తల్బినాకు కొన్ని మార్పులతో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. 

ప్రస్తుత ఆధునిక యుగంలో మరుగున పడుతున్న పాతకాలం వంట రెసిప్పీలను తిరిగి ప్రజల ముందుకు అన్వేషించి తీసుకురావటం పెద్ద ఉద్యమంలో భాగంగా చూస్తున్నట్లు హైదరాబాదీ, సూఫీ వంటకాలలో నిపుణుడైన డాక్టర్ హసీబ్ జాఫరీ అన్నారు. ప్రజలు నేటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారాల కోసం అన్వేషించటం, వాటికి ఆధ్యాత్మిక సంబంధం కూడా ఉండటంతో స్వీకరణ పెరుగుతోంది. 

ప్రవక్త కాలంలో బియ్యం ప్రధానమైన ఆహారంగా ఉండేది కాదు. అయితే రుజ్ మదానీ అనే మసాలా బియ్యం వంటకం మదీనా నుండి వచ్చిన వంటకం నగరంలోకి ప్రవేశించింది. ఇలా హైదరాబాద్ నగరంలో ఇండియన్, పర్షియన్, టర్కిష్, అరబిక్ వంటకాలు సహజమైనవిగా మారిపోయాయి మెనూలో చోటు దక్కించుకున్నాయి. చార్మినార్ ప్రాంతంలోని నాలుగు మినార్లు అన్ని దిశల నుంచి వచ్చిన ఆహార రుచులు, మార్పులకు కొత్త రూపాన్ని అందించాయి. 

థారిడ్ : మాంసం రసంలో నానబెట్టిన బ్రెడ్‌తో తయారు చేయబడింది. దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు దీనిలో జోడిస్తారు. క్యారెట్, ఉల్లి, కాయధాన్యాలు వంటి కూరగాయను ఇందులో కలిపి తయారు చేస్తారు.

హరీస్ : గొర్రె లేదా చికెన్‌తో గోధుమలను ఉడకబెట్టి, మందపాటి గంజి లాంటి స్థిరత్వాన్ని చేరుకునే వరకు నెమ్మదిగా ఉడికించి, ఉప్పు, నెయ్యి వేసి తయారు చేస్తారు. ఇది దాని అధిక పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది.

నబీజ్ : ప్రవక్తకు ఇష్టమైన పానీయాల్లో ఒకటి నబీజ్. ఇది తీపి రిఫ్రెష్ పానీయం. దీనిని ఖర్జూరం లేదా ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి తయారు చేస్తారు. ఇది శరీరాన్ని హైడ్రేషన్ చేస్తూ మంచి శక్తిని అందిస్తుంది.

తల్బినా : ఇది ప్రవక్తకు ఇష్టమైనది బార్లీ, పాలు, తేనెతో తయారు చేయబడే గంజి. పోషకాలతో సమృద్ధిగా ఉండే ఇస్లామిక్ సమాజంలో ఒక సాధారణ వంటకం.