హైదరాబాద్: పాతబస్తీలో కరెంట్,విజిలెన్స్ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అధికారులను నిర్బంధించి రిపోర్టులను చించేశారు స్థానికులు. విద్యుత్ ఛా ర్జీల వసూలు ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇస్తారని స్థానికులు నిలదీశారు. సాకులు చెపుతు తనఖీలకు వస్తే ఊరుకోమని హెచ్చరించారు.
గుంటల్ షా బాబా దర్గా దగ్గర విద్యుత్, విజిలెన్స్ అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతుందని సమాచారంతో తనిఖీలకు విజిలెన్స్, కరెంట్ అధికారులు వెళ్లారు. దీంతో స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. విద్యుత్ బిల్లులు కట్టకుండా ఎగవేత చేస్తున్న ప్రాంతాల్లో దక్షిణ మండలం కూడా ఉండటంతో ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు తనిఖీలకు వెళ్లారు.