గుజరాత్​లో హైదరాబాద్​ సైబర్ ​క్రైంభారీ ఆపరేషన్​

  • సీఏ సహా 36 మంది క్రిమినల్స్​ అరెస్ట్​
  • 70 ప్రాంతాల్లో 40 మంది పోలీసుల సోదాలు.. 13 రోజులు సెర్చ్ ఆపరేషన్‌
  • దేశవ్యాప్తంగా 983, రాష్ట్రంలో 131 కేసులతో లింక్స్​
  • ట్రేడింగ్‌, ఇన్వెస్ట్​మెంట్‌ పేరుతో మోసాలు
  • 20 కేసుల్లో రూ.12.49 కోట్లు కొట్టేసిన సైబర్ క్రిమినల్స్‌.. రూ.38.28 లక్షలు, 
  • 112 సిమ్‌కార్డులు,410  చెక్‌బుక్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : గుజరాత్​లో హైదరాబాద్ ​సిటీ సైబర్ ​క్రైం పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్​ సైబర్ ​క్రిమినల్స్’​సక్సెస్​ అయ్యింది. భారీ ఆపరేషన్​నిర్వహించిన పోలీసులు దేశవ్యాప్తంగా 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న 36 మందిని అరెస్ట్ చేశారు. హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ నుంచి సైబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ క్రైమ్ విభాగానికి చెందిన 7 బృందాలు గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించాయి. మొత్తం గుజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాత్ రాష్ట్రాన్ని జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లెడ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టాయి. 70 ప్రాంతాల్లో 40 మంది పోలీసులు13 రోజులపాటు సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.36 మందిని అదుపులోకి తీసుకొని, హైదరాబాద్​కు తరలించారు.  ఇందులో  ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఒక చార్టెడ్ అకౌంట్ (సీఏ) కూడా ఉన్నాడు.

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫెడెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో  మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరి వద్దనుంచి రూ.38.28 లక్షల నగదు,4 ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 64 సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,112 సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డ్స్​, 410 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 64 డెబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్స్​,7 స్వైపింగ్ మెషీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,6 షెల్ కంపెనీల స్టాంప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. వీరిని రాష్ట్రంలో నమోదైన 131 కేసుల్లో నిందితులుగా తేల్చారు. సిటీలో 30 కేసులు నమోదు కాగా, 20 కేసుల్లో రూ.12.49 కోట్లు కొట్టేశారు. వీటిలో రూ.4.4 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇందులో బాధితులకు రూ.1.5 కోట్లు రిఫండ్ చేశారు. కేసుల వివరాలను సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి శనివారం వెల్లడించారు.

సైబర్ నేరగాళ్లకు అడ్డాగా గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,ఫెడెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో  జరుగుతున్న మోసాలపై దర్యాప్తు కోసం సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో 7 స్పెషల్ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరగాళ్లు వినియోగించిన బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐపీ అడ్రస్​ల ఆధారంగా సెర్చ్​ ప్రారంభించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో నమోదైన 30 కేసుల్లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సైబర్ నేరగాళ్ల లింక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తించారు. బాధితులకు సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో సైబర్ నేరగాళ్లు పంపిన లింక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐపీ అడ్రస్​లను ట్రేస్ చేశారు. డబ్బులు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ అయిన అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాటి అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేశారు.

స్థానికంగా లభించిన క్లూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వీరిలో కొంత మంది ఏజెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను,షెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీల పేర్లతో అకౌంట్స్ ఓపెన్ చేసిన వారిని గుర్తించారు. ప్రధాన నేరగాళ్లను కాకుండా వారికి సహకరించిన వారిని ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇలా గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సూరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా దాదాపు 70 ప్రాంతాల్లో 13 రోజుల పాటు సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 131 కేసుల్లో డబ్బులు కొట్టేసిన 36 మందిని అరెస్ట్ చేశారు. వీరి అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపాజిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.

దేశవ్యాప్తంగా నమోదైన 983 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్టు తేల్చారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సీఏ కనని నికెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(33), మరో నిందితుడు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వసోయ(55)ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద 226 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు ఆధారంగా  సూరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సాగర్ ప్రజాపతి (27), పర్మర్ కిరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నతుభాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(33)ను అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో లింక్స్ మొత్తం గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉండడం గమనార్హం.