
హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై దేశ వ్యాప్తంగా 23 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అంకిత్ అరోరా(38) ప్రైవేట్ ఉద్యోగి. ఈజీ మనీ కోసం గూగుల్‌లో సర్చ్చేస్తున్న టైంలో ఎక్కువ మంది ట్రేడింగ్‌కు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుసుకున్నాడు. అలాంటి వారిని టార్గెట్‌చేసి అక్రమ సంపాదనకు తెరలేపాడు. ట్రేడింగ్టిప్స్ఇస్తానని, చెప్పిన కంపెనీల స్టాక్స్కొనాలని పలువురిని నమ్మిస్తున్నాడు.
అలా సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిని Doll6726@navya అనే టెలిగ్రామ్ ఐడీ ద్వారా సంప్రదించాడు. ట్రేడింగ్గైడెన్స్కు అధిక మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని నమ్మబలికి రూ.కోటి22లక్షల87వేల120 బదిలీ చేయించుకున్నాడు. తర్వాత ఫోన్లు, మెసేజ్‌లు ఆగిపోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్క్రైమ్పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో అంకిత్అరోరాను గుర్తించారు. ఇతనిపై దేశవ్యాప్తంగా 23 కేసులు ఉన్నట్లు సిటీ సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ దార కవిత తెలిపారు. ప్రధాన నిందితుడు దీపక్ కుమార్ పరారీలో ఉన్నాడన్నారు.