
రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు.. లోన్లు ఇలా రకరకాల పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు.అమాయకులే టార్గెట్ గా అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్నేరగాళ్లు.
లేటెస్ట్ గా స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు చేస్తున్న సైబర్ నేరాగాడు ఉత్తర ప్రదేశ్ చెందిన అంకిత్ అరోరాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా అంకిత్ అరోరా పైన 23 కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మాయమాటలు చెప్పి సికింద్రాబాద్ కు చెందిన బాధితుడు నుంచి 1.22కోట్లు కాజేసిన నిందితుడు. బాధితుడు ఫిర్యాదుతో విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు అంకిత్ అరోరా నుంచి 11 ఏటీఎం కార్డులు, 2 బ్యాంక్ ఖాతా పుస్తకం, 2 సెల్ ఫోన్ లు 11 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.