బషీర్ బాగ్, వెలుగు: సైబర్ చీటర్స్ కొట్టేసిన నగదును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. నాలుగు కేసుల్లో రూ. 28.07 లక్షలను సైబర్ చీటర్స్ అకౌంట్లలోకి వెళ్లకుండా చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన ప్రకారం.. గత సోమవారం సిటీకి చెందిన ఓ వ్యక్తిని ఇన్వెస్ట్ మెంట్ పేరిట సైబర్ చీటర్స్ మోసగించి.. రూ. 9.40 లక్షలు కాజేశారు.
సైబర్ క్రైమ్ టీమ్ కు కంప్లయింట్ చేయగా అతని బ్యాంక్ అకౌంట్ ను నిలుపుదల చేశారు. అప్పటికే సైబర్ చీటర్స్ తమ అకౌంట్లలోకి డబ్బులను ట్రాన్స్ ఫర్ చేసుకోగా మిగిలిన రూ. 1.50లక్షలను ఫ్రీజ్ చేశారు. మంగళవారం కేవైసీ పేరిట రూ. 2 లక్షలు మోసపోయానని మరో బాధితుడు కంప్లయింట్ చేయగా.. రూ. 1,75 లక్షలను ఫ్రీజ్ చేశారు.
ఇదే రోజు ఇంకో కేసులో ట్రాయ్ పేరిట సైబర్ చీటర్స్ ఫోన్ చేసి రూ. 5.90 లక్షలను కొట్టేశారు. అతని కంప్లయింట్ తో రూ. 4. 73లక్షలను ఫ్రీజ్ చేశారు. ముంబై పోలీసుల మంటూ ఫోన్ చేసిన సైబర్ చీటర్స్ బాధితుడి నుంచి రూ. 20. 08లక్షలను ట్రాన్స్ ఫర్ చేసుకోగా.. బాధితుడు సైబర్ క్రైమ్ సెల్ ను ఆశ్రయించగా రూ. 20. 08లను బ్లాక్ చేయించారు.
ఇలా నలుగురు బాధితులు మొత్తం రూ. 37.32 లక్షలు మోసపోతే, అందులో రూ. 28.07 లక్షల నగదు ఫ్రీజ్ చేసి, బాధితులకు అందజేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.