
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చిలో 54 మంది బాధితులకు 3 కోట్ల27లక్షల 86 వేల 687 రూపాయలు రిఫండ్ చేశారు. స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్, ఇన్వెస్ట్ మెంట్స్ పేరుతో మోసపోయిన 32 మంది బాధితులకు కోటి 62 లక్షల 19 వేల 544 రూపాయలు తిరిగి ఇచ్చారు. అలాగే ఫెడెక్స్ ,మనీ లాండరింగ్ వంటి వాటిలో మోసపోయిన 14 మంది బాధితులకు కోటి 57 లక్షల 25 వేల 141 రూపాయలు తిరిగి ఇచ్చారు పోలీసులు.
ఇక క్యూఆర్ కోడ్ లతో డబ్బులు పోగొట్టుకున్న ఓ బాధితుడికి రూ.43 వేల 310 తిరిగి ఇచ్చేశారు పోలీసులు. క్రెడిట్ కార్డ్, రివార్డ్స్ పాయింట్స్ రిడెంప్షన్ పేరుతో మోసం చేసిన కేసులో ఓ బాధితుడికి 88 వేల591రూపాయలను కోర్టు ఆదేశాలతో తిరిగి ఇచ్చేసింది బ్యాంకు. అలాగే ఎస్ఎమ్ఎస్ వాట్సప్ లలో లింక్ ల ఓపెన్ చేసి, పలు యాప్ లు డౌన్ లోడ్ చేసి పోగొట్టుకున్న బాధిుతలకు రూ.3లక్షల 39వేల700 తిరిగి ఇప్పించారు పోలీసులు
►ALSO READ | మీ వల్లే నా భార్య దూరమైంది: అత్త, వదిన, కూతురిని కాల్చి చంపి ఆ తర్వాత వ్యక్తి సూసైడ్