హైదరాబాద్​లో ఘనంగా గురుపూజోత్సవం

హైదరాబాద్​లో ఘనంగా గురుపూజోత్సవం

బషీర్ బాగ్/రంగారెడ్డి/మేడ్చల్ కలెక్టరేట్/వికారాబాద్/ముషీరాబాద్/షాద్​నగర్, వెలుగు : హైదరాబాద్ డీఈఓ  రోహిణి ఆధ్వర్యంలో గురువారం కింగ్ కోఠి భారతీయ విద్యా భవన్ ఆడిటోరియంలో టీచర్స్​డే నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. రంగారెడ్డి జిల్లాలోని 170 మంది ఉత్తమ టీచర్లను గురువారం ఖైరతాబాద్​లోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో ఘనంగా సన్మానించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనమండలి సభ్యుడు బొగ్గారపు దయానంద్, కలెక్టర్ శశాంక

జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఈఓ సుశీందర్ రావు  పాల్గొన్నారు. మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టరేట్​లో ఉత్తమ టీచర్లను సన్మానించారు. కలెక్టర్ గౌతం, డీఈఓ విజయ కుమారి, టీచర్​ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు. వికారాబాద్​కలెక్టరేట్​లో నిర్వహించిన గురుపూజోత్సవంలో 39 మంది టీచర్లను సన్మానించారు. స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డీఈఓ రేణుకాదేవి, ఆర్డీఓ వాసుచంద్ర పాల్గొన్నారు. 

టీచర్స్ సెల్ కన్వీనర్ ఆచార్య శివ రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ట్యాంక్ బండ్ పైన ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహం వద్ద టీచర్స్​డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ కె.లక్ష్మణ్, మాజీ కేంద్రమంత్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొని సర్వేపల్లి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు . సమాజంలో   టీచర్ల పాత్ర  కీలకమైందని  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్​, అవోపా రాష్ట్ర అధ్యక్షులు మలిపెద్ద శంకర్ అన్నారు. గురువారం టీచర్స్​ డే సందర్భంగా  అవోపా షాద్ నగర్ అధ్యక్షుడు  ఎల్కూర్తి నాగరాజు అధ్వర్యంలో  వేడుకలు  నిర్వహించారు.   178 మంది టీచర్లను  శాలువాలతో సత్కరించారు.