హైదరాబాద్ సిటీ, వెలుగు : శబరిమల అయ్యప్పస్వామికి హైదరాబాద్ చెందిన ఆకారం రమేశ్ రూ.10 లక్షల విలువ చేసే 120 గ్రాముల బంగారు విల్లు, బాణం, 400 గ్రాముల వెండి ఏనుగులు సమర్పించారు. తన కొడుకు డాక్టర్ కావాలని 20 ఏండ్లుగా స్వామిని వేడుకుంటున్నానని, ప్రస్తుతం తన కొడుకు గాంధీ మెడికల్ కాలేజ్ లో థర్డియర్ చదువుతున్నాడని చెప్పారు. ఈ క్రమంలోనే 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష చేసి శబరిమలలో రెండురోజుల క్రితం అయ్యప్ప స్వామికి బంగారు విల్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.