- 25న గండిపేట్ పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్డిజాస్టర్మేనేజ్మెంట్అండ్అసెట్ప్రొటెక్షన్ఏజెన్సీ(హైడ్రా)కి జనం నుంచి మద్దతు లభిస్తోంది. ఈ నెల 25న గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట్ పార్కు వద్ద 'హైడ్రా సపోర్ట్ వాక్' నిర్వహిస్తున్నారు. హైడ్రా చేపట్టిన పనులతో ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే కాకుండా చెరువులకు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుందని
ఈ వాక్ నిర్వహిస్తున్నట్టు సొసైటీ సభ్యులు తెలిపారు. హైడ్రాకు మద్దతు ఇవ్వడానికి ఈ వాక్ లో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. హైడ్రా చొరవతో రాబోయే తరాలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించవచ్చని, ఈ వాక్ లో ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాల్గొనాలని వారు కోరారు.