హైదరాబాద్, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం, విద్యార్థులకు స్కూల్ యూనిఫాం అందజేత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఈఓ రోహిణి సహా పలువురి అధికారులకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి షోకాజ్‌నోటీసులు జారీ చేశారు. షోకాజ్‌నోటీసులు అందుకున్న వారిలో డీఈఓ, ఇన్చార్జ్ డీఈఓ, అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్, బహుదూర్ పురా డిప్యూటీ డీఈఓ ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.