యూటీఎఫ్​ జిల్లా కార్యవర్గం ఎన్నిక

యూటీఎఫ్​ జిల్లా కార్యవర్గం ఎన్నిక

సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్​) హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎనగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా  చిత్తలూరి వెంకటేశ్వరరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం  హైదరాబాద్​లో జరిగిన టీయూటీఎఫ్​నూతన కార్యవర్గాన్ని  ప్రకటించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా యర్రంశెట్టి  స్నేహ, అధ్యక్షులుగా ఎనగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చిత్తలూరి వెంకటేశ్వరరావు,  ఉపాధ్యక్షులుగా హెచ్ ప్రభాకర్,  మహిళా ఉపాధ్యక్షురాలుగా  కె.సునిత, మహిళా సంయుక్త కార్యదర్శిగా  టి స్వర్ణలత, సంయుక్త కార్యదర్శిగా  జి నారాయణ, ఆర్థిక కార్యదర్శిగా గణేశ్​  ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా  జిల్లా అధ్యక్షులు  ఎనగందుల శ్రీనివాస్​ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న నాలుగు  డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.