![ఉద్యోగులు అందరూ ఫంక్షన్కు వెళ్లారు..ఆఫీస్ ను గాలికి వదిలేశారు..](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-distrtict-welfare-officer-house-gruhapravesam-function-all-employees-are-attend-that-programme_CQb7dpy8F4.jpg)
- జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ గృహ ప్రవేశానికి తరలివెళ్లిన ఉద్యోగులు
- మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీస్ ఖాళీ
హైదరాబాద్సిటీ, వెలుగు: ఆయన ఓ జిల్లా శాఖకు ఇన్చార్జి. ఈ మధ్యే సొంతిల్లు కట్టుకున్నాడు. శుక్రవారం మంచిరోజని గృహప్రవేశం పెట్టుకున్నాడు. దీని కోసం లీవ్పెట్టాడు. తన కింద పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తన కింద పనిచే వారందరినీ ఫంక్షన్కు పట్టుకుపోవడంతో కార్యాలయమంతా ఖాళీ అయ్యింది.
ఇది జరిగింది ఎక్కడో శివారులో కాదు.. సాక్షాత్తు నగరం నడిబొడ్డున ఉన్న లక్డీకాపూల్లోని హైదరాబాద్కలెక్టరేట్లో... ఈ ప్రాంగణంలోని ఓ బ్లాక్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆఫీసు ఉంది. డీసీపీఓ, ప్రొటెక్షన్ ఆఫీసర్, సూపర్వైజర్లు, ఫీల్డ్, రెస్క్యూ ఆఫీసర్లు, అకౌంటెట్లు ఇతర ఉద్యోగులు, సిబ్బంది కలిపి 50 మంది వరకు ఇక్కడ పని చేస్తుంటారు. వీరిని కలవడానికి జిల్లా వ్యాప్తంగా రోజూ వందలాది మంది మహిళలు, పిల్లలు, తల్లిదండ్రులు, వృద్ధులు వచ్చి పోతుంటారు. అలాగే 1,098కు వచ్చే కాల్స్రిసీవ్చేసుకుని పిల్లలను రెస్క్యూ చేయాల్సి ఉంటుంది.
కానీ, శుక్రవారం జిల్లా వెల్ఫేర్ఆఫీసర్అక్కేశ్వర్రావు ఇంట్లో గృహ ప్రవేశం ఉండడంతో అందరూ అక్కడికే వెళ్లారు. 50 మందిలో కేవలం ఒక అకౌంటెంట్, మరో సిబ్బంది మాత్రమే ఆఫీసుకు వచ్చారు. ఉదయమే అంతా ఆఫీసుకు వచ్చినా రిజిస్టర్లో సంతకాలు పెట్టి, 10 గంటల కల్లా బయటపడ్డారు. ఆఫీస్తలుపులు ఖుల్లా ఉన్నా లోపల ఒక్కరూ లేక వివిధ అవసరాలతో వచ్చిన వాళ్లంతా గంటలపాటు వేచి చూసి నిరాశతో వెనుదిరిగారు.
‘మా కూతురును స్కూల్కు పంపడం లేదని ఇక్కడి ఆఫీసర్లు తీసుకువచ్చిన్రు. ఎక్కడుందని అడిగితే హోంలో పెట్టామని, శుక్రవారం వస్తే చెప్తామని అన్నరు.. ఈ రోజు వస్తే ఎవరూ లేరు.. నేను ఎవరిని అడగాలి’ అని భార్యభర్తలు వాపోయారు. సాయంత్రం వరకూ వెయిట్చేసి వెళ్లిపోయారు. అలాగే అడాప్షన్ వివరాలు తెలుసుకునేందుకు మరొకరు అక్కడే వేచి చూడడం కనిపించింది.
ఇలా ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు దాదాపు100 మంది వరకు వేచి చూసినా ఎవరూ రాలేదు. మధ్యాహ్నం మూడున్నరకు ఒకరు బాలరక్ష భవన్కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. జనాలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ఆఫీసర్ ఉన్న ఉద్యోగులను తన ఫంక్షన్కు పట్టుకుపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆఫీస్వద్దకే ప్రత్యేకంగా బస్సులు పంపించినట్లు సమాచారం.