అయోడిన్ ఉన్న ఉప్పునే వాడండి : హైదరాబాద్​ డీఎంహెచ్ఓ

అయోడిన్ ఉన్న ఉప్పునే వాడండి : హైదరాబాద్​ డీఎంహెచ్ఓ

హైదరాబాద్ సిటీ, వెలుగు: అయోడిన్ ముఖ్యమైన సూక్ష్మ పోషకమని, ప్రతి ఒక్కరూ అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలని హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్​జె.వెంకట్​సూచించారు. గొంతు భాగంలోని థైరాయిడ్ గ్రంథి అయోడిన్ సూక్ష్మ పోషకాలు ఉపయోగించుకొని థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. సోమవారం డీఎంహెచ్ఓ ఆఫీసులో నిర్వహించిన ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవ సదస్సులో డాక్టర్​వెంకట్​పాల్గొని మాట్లాడారు. అయోడిన్ లోపం కారణంగా కలిగే నష్టాలను వివరించారు. బస్తీ దవాఖానాల ద్వారా అయోడిన్ ఉప్పుని వాడేటట్లు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అయోడిన్ వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రోగ్రాం ఆఫీసర్​డాక్టర్ ఆశ్రితరెడ్డి, ఆఫీసర్లు జక్కుల రాములు, సునీల్ కుమార్, నరసింహ, అంజయ్యగౌడ్, ఒమర్ సాలేహ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.