సిటీలో 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి

సిటీలో 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు హైదరాబాద్ DMHO వెంకట్. బేగంపేటలో వైద్యశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందిరమ్మ నగర్, రసూల్ పూర్ లో ర్యాలీ చేశారు. హైదరాబాద్ ను 100శాతం వ్యాక్సిన్ నగరంగా చేయాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెంకట్ చెప్పారు. ఇప్పటివరకు సిటీలో 80శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందన్నారు. కంటోన్మెంట్ జోన్ లో 15 టీమ్స్ పని చేస్తున్నట్లు చెప్పారు.  మొబైల్ వెహికల్స్ ద్వారా వాక్సినేషన్ కొనసాగుతుందన్నారు.