బస్తీ దవాఖానలో వైద్యసేవల తనిఖీ

బస్తీ దవాఖానలో వైద్యసేవల తనిఖీ

పద్మారావునగర్, వెలుగు:  బన్సీలాల్ పేట్ డివిజన్ చాచా నెహ్రూనగర్ బస్తీ దవాఖానాను పచ్చదనం-స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం  హైదరాబాద్ డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటి సందర్శించారు. 

దవాఖాన పరిసరాలను, ఫార్మసీ గదిని, పేషెంట్ల వెయిటింగ్ రూమ్ ను  తనిఖీ చేశారు.  పేషెంట్ల సందర్శన, వసతి సౌకర్యాలపై డాక్టర్ రాజేశ్​ను, దవాఖానలో అందుతున్న సేవలను పేషెంట్ల ను అడిగి తెలుసుకున్నారు. లాలాపేట్ క్లస్టర్ ఎస్ పీ హెచ్ ఓ డాక్టర్ జయశ్రీ ఉన్నారు.