ఆన్లైన్లో బట్టలు కొంటున్నారా... జాగ్రత! లింక్ క్లిక్ చేసి రూ. 1.5 లక్షలు పోగొట్టుకున్న మహిళా డాక్టర్

ఆన్లైన్ షాపింగ్.. ఈ రోజుల్లో చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆన్లైన్ షాపింగ్ హాబీ అయిపోయింది. ఆన్లైన్లో ఉండే ఆఫర్లను చూసి అవసరం ఉన్నా లేకున్నా ఆర్డర్ పెడుతుంటారు చాలా మంది. ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆసరా అయ్యింది. ఆన్లైన్ క్లాతింగ్ ఆఫర్ పేరిట కొత్త తరహా మోసానికి తెర తీశారు కేటుగాళ్లు. క్లాతింగ్ ఆఫర్ అంటూ వచ్చిన మెసేజ్ ఆశపడ్డ ఓ మహిళా డాక్టర్ రూ. 1.5 లక్షలు పోగొట్టుకుంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొదట ఆన్లైన్ క్లాతింగ్ ఆఫర్ అంటూ మహిళా డాక్టర్ కు మెసేజ్ పంపారు కెల్తుగాళ్ళు. ఆఫర్ చూసి అట్రాక్ట్ అయినా మహిళ ముందు వెనక చూసుకోకుండా లింక్ క్లిక్ చేసింది. ఆ తర్వాత ఆమె అకౌంట్ కి కొంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసి నమ్మించారు మోసగాళ్లు. దీంతో.. వాళ్ళు చెప్పిన కొన్ని టాస్కులు చేసింది సదరు మహిళ.

Also Read :- లవ్‌లో బ్రేకప్ చెప్తే సూసైడ్‌కు ప్రేరేపించినట్టు కాదు

టాస్కుల పేరుతో మహిళా డాక్టర్ ను మభ్యపెట్టిన కేటుగాళ్లు... బట్టలను ఆమె అడ్రస్ కి పంపుతామని నమ్మించి చిన్న చిన్న మొత్తంలో ఒకటిన్నర లక్ష రూపాయల మేర ఆమె నుండి తీసుకున్నారు. ఆ తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటంతో మోసపోయానని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.