రియల్‌ ఎస్టేట్‌లో మన సిటీ​కి  తిరుగులేదు

రియల్‌ ఎస్టేట్‌లో మన సిటీ​కి  తిరుగులేదు

రియల్టీరంగంలో హైదరాబాద్​ పరుగు ఆగడం లేదు. 2021 మూడో క్వార్టర్​లో  భారతీయ నగరాల్లో హైదరాబాద్‌‌‌‌లోనే ఇండ్ల ధరలు అత్యధికంగా పెరిగాయి. తరువాత స్థానాల్లో చెన్నై నిలిచింది. ఉత్తరాది నగరాల్లో కోల్‌‌కతా, అహ్మదాబాద్​లో పెరుగుదల ఎక్కువగా ఉంది.  గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్‌‌లో హైదరాబాద్ 128వ స్థానంలో ఉంది. గత క్యూ3తో పోలిస్తే తాజా క్యూ3లో రేట్లు 2.5శాతం పెరిగాయి. చెన్నైలో 2.2శాతం రెసిడెన్షియల్ ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా 131వ స్థానంలో ఉంది.

బెంగళూరు: హైదరాబాద్, చెన్నై, కోల్‌‌‌‌‌‌‌‌‌‌కతా,  అహ్మదాబాద్‌‌‌‌లో జూలై–-సెప్టెంబర్‌‌‌‌ క్వార్టర్​లో (క్యూ3) ఇండ్ల ధరలు పెరిగాయి. అయితే చాలా ప్రధాన మెట్రోల్లో వీటి ధరలు తగ్గాయి. ప్రాపర్టీ కన్సల్టంట్​ నైట్ ఫ్రాంక్ తయారు చేసిన ‘గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ క్యూ3 2021’ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...ఈ ఇండెక్స్‌‌‌‌లో ముంబైకి అతి తక్కువగా146వ ర్యాంకు వచ్చింది. ఏడాది ప్రాతిపదికన ఇక్కడ ఇండ్ల ధరల్లో 1.8 శాతం తగ్గుదల కనిపించింది. 140వ స్థానంలో ఉన్న బెంగళూరులో 0.2 శాతం తగ్గుదల రికార్డయింది. ఢిల్లీలో ఇదేకాలంలో ధరలు 0.7శాతం తగ్గడంతో 142వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర నగరం పూణేలో 1.5శాతం ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో ఇండ్ల ధరలు సగటున10.6 శాతం పెరిగాయి. 2005 తరువాత ఇంత వేగంగా ధరలు పెరగడం ఇదే మొదటిసారి. దాదాపు 93శాతం నగరాల్లో 12 నెలల్లో ధరలు పెరిగాయి. 
ఇక నుంచి కూడా పెరగొచ్చు
“ప్రభుత్వ ప్యాకేజీలు, తక్కువ వడ్డీ రేట్ల వల్ల బలమైన డిమాండ్ కనిపించింది. గత ఆరు క్వార్టర్లలో రెసిడెన్షియల్​ మార్కెట్​ బాగానే ఉంది. అమ్మకాల పెరుగుదలకు ధరలు చాలా కీలకంగా మారాయి.  ఇక నుంచి కూడా పెరుగుదల బాగుంటుందని అనుకుంటున్నాం" అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. “భవిష్యత్ డిమాండ్‌‌‌‌పై ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు, ఓమిక్రాన్ ప్రభావం  ఇన్​ఫ్లేషన్​ ఒత్తిడి వంటి అంశాలు కొనుగోలుదారుల సెంటిమెంట్లను మార్చగలుగుతాయి" అని బైజల్ వివరించారు. గ్లోబల్ రెసిడెన్షియల్ సిటీస్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో ప్రధాన మార్కెట్ల రెసిడెన్షియల్​ధరలను పరిశీలిస్తుంది. టర్కీ నగరం ఇజ్మీర్​లో రేట్లు అత్యధికంగా 34.8శాతం పెరిగాయి. 

ప్రైమ్​ లొకేషన్లలో భూమి అందుబాటులో ఉండటం, తక్కువ వడ్డీకి ఫైనాన్స్​ రావడం, ఆఫర్ల వల్ల బయర్లు, ఇన్వెస్టర్లు రియల్టీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్​లో ఐటీ, ఐటీఈఎస్​, బీఎఫ్​ఎస్​ సెక్టార్​లో బలమైన గ్రోత్​ కనిపిస్తోంది. ఫలితంగా రియల్టీ సెక్టార్​కు మేలు జరుగుతోంది.  కోకాపేట్, గండిపేట్​, ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్​లో హైరైజ్​ అపార్ట్​మెంట్లకు​ భారీగా డిమాండ్​ ఉంది. కొంపల్లి, పటాన్​చెరు, శంకర్​పల్లి, భువనగిరిలో అపార్టుమెంట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.                                                                                                                                                        ‑ ఆర్థర్​ శామ్​సన్​, బ్రాంచ్​ డైరెక్టర్​, నైట్​ఫ్రాంక్