పోయాం మోసం : కాజల్ వస్తుందంటూ హోలీ టికెట్లు.. తీరా వెళితే జూనియర్ ఆర్టిస్టులు కూడా లేరు..!

పోయాం మోసం : కాజల్ వస్తుందంటూ హోలీ టికెట్లు.. తీరా వెళితే జూనియర్ ఆర్టిస్టులు కూడా లేరు..!

హైదరాబాద్ లో హోలీ సంబరాల సందడి అంబరాన్నంటింది.. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా బయటకు వచ్చి హోలీలో పాల్గొనడంతో సిటీ రోడ్లన్నీ రంగులమయం అయ్యాయి. ఇదిలా ఉండగా.. హోలీ సందర్భంగా పెద్ద ఎత్తున స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు ఈవెంట్ అరగనైజర్లు. కాజల్ వంటి స్టార్ హీరోయిన్స్ గెస్ట్ గా రానున్నారని..డీజేలు, రైన్ డ్యాన్స్ లు, ఇలా రకరకాల ఆకర్షణలతో ప్యాకేజెస్ పెట్టి ఈవెంట్లు ప్లాన్ చేశారు. అసలే హోలీ పైగా వీకెండ్ కావడంతో భారీగా టికెట్లు కొన్నారు యూత్.  అయితే.. ప్యాకేజ్ లో చెప్పినట్లుగా హీరోయిన్ కాజల్ ఈవెంట్ కి రాకపోవడంతో ఈవెంట్ ఆర్గనైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యూత్.

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈవెంట్స్ ప్లాన్ చేసినప్పటికీ.. పోలీసులు ఒంటిగంటకే వచ్చి బయటికి పంపడంతో.. వేలకు వేలు పెట్టి టికెట్లు కొని మోసపోయామని లబోదిబోమంటున్నారు యూత్.  కనీసం డీజేలు కూడా సరిగ్గా పనిచేయలేదని. మండిపడుతున్నారు యూత్.

Also Read:-శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్..

మాదాపూర్ లో ఉన్న మ్యాన్ మేడ్ హిల్స్ లో హోలీ నేషన్ పేరిట ప్లాన్ చేసిన ఈవెంట్ కి కాజల్ వస్తుందంటూ టికెట్లు అమ్మారు. అంతే.. ఎగబడి టికెట్లు కొన్నారు యూత్.. తీరా చుస్తే ఈవెంట్ కి కాజల్ కాదు కదా జూనియర్ ఆర్టిస్టులు కూడా రాలేదు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు యూత్. కోకాపేట లోని ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ లో కూడా అరకొర అరేంజ్మెంట్స్ తో హోలీ ఈవెంట్ నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు యూత్. తమ టికెట్ డబ్బులు తమకు రీఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది యూత్.