హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు. ఓ విదేశీ ప్రయాణికుడి  నుంచి  రూ. 67.11 లక్షలు విలువైన అమెరికన్ డాలర్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  సమాచారం అందుకున్న DRI స్లీత్‌లు దుబాయ్‌కి వెళ్లే ప్రయాణికుడిని విమానాశ్రయంలో ఆపి, బ్యాగేజీని తనిఖీ చేశారు. సదరు ప్రయాణికుడు అక్రమంగా దేశం నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్న రూ.67,11,250కి సమానమైన అమెరికన్ డాలర్లను అధికారులు గుర్తించారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ప్రయాణికుడిని అరెస్టు చేస్తారు. . దీని వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు తదుపని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.