ఈ నెల(మే) 13న జరగనున్న పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. 14 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 42 కోట్ల విలువైన వస్తువులు, లిక్కర్,డబ్బులు సీజ్ చేశామన్నారు. 3 వేల 896 పోలింగ్ బూత్ లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని చెప్పారు రొనాల్డ్ రాస్.
ఎన్నికల ప్రచారం శనివారం (మే11) సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది..తర్వాత సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుందన్నారు రోనాల్డ్ రాస్. ప్రకటనలు ఎన్నికల అధికారులతో అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ప్రచురించాలని సూచించారు. ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే సీ విజిల్ ద్వారా చేయొచ్చన్నారు. వీటిని తక్షణమే పరిష్కరిస్తామన్నారు .
వచ్చే ఎన్నికల్లో 15 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు సీపీ కొత్తకోట శ్రీనివాస్. హైదరాబాద్ జిల్లా పరిధిలో 383 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPF సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేశారు. మొత్తం 25 కంపెనీల బలగాలతో భద్రతా ఏర్పాటు చేశారు.