5 కేజీల గంజాయి చాక్లెట్లు సీజ్..బిహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

5 కేజీల గంజాయి చాక్లెట్లు సీజ్..బిహార్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు : గంజాయి చాక్లె ట్లు అమ్ముతున్న వ్యక్తిని హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  బోడుప్పల్ పరిధి గౌతంనగర్‌ లో  గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రంగారెడ్డి ఎస్టీఎఫ్ టీమ్‌ గురువారం దాడి చేసింది. బిహార్‌కు చెందిన వీరేంద్ర పండరీ అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి  5 కేజీల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకొని, ఘట్ కేసర్ ఎక్సైజ్ పీఎస్​లో అప్పగించారు.

అలాగే మలక్​పేట్ అక్బర్‌ బాగ్​లో స్కూటీపై గంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎక్సైజ్‌ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 3.74 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్​లు , ఒక స్క్రూటీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహమ్మద్‌ జూబేర్‌, సయ్యద్‌ జహంగిర్‌గా గుర్తించి, రిమాండ్​కు తరలించారు.