27.51 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం

27.51 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం
  • నలుగురు అరెస్ట్, పరారీలో ఇద్దరు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: నాంపల్లి, మల్కాజిగిరి ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల పరిధిలో రూ.1.70 లక్షల విలువైన 27.51 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. రంజాన్‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌ ముంబయిలోని అంధేరి నుంచి ఎండీఎంఏ డ్రగ్​తీసుకువచ్చాడు. శుక్రవారం నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఇర్ఫాన్, అన్వర్‌‌‌‌‌‌‌‌లకు విక్రయిస్తుండగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ మెంట్‌‌‌‌‌‌‌‌టీం, సీఐ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ టీం పట్టుకున్నాయి. 24.10 గ్రాముల డ్రగ్​ను స్వాధీనం చేసుకొని, ముగ్గురినీ అరెస్ట్​చేశారు. 

మల్కాజిగిరి ఆర్‌‌‌‌‌‌‌‌కే నగర్‌‌‌‌‌‌‌‌ లో డ్రగ్​విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఎస్ టీఎఫ్  బీ టీం సీఐ భిక్షారెడ్డి, ఎస్ఐ బాలరాజు టీం అక్కడికి వెళ్లారు. డ్రగ్​అమ్ముతున్న స్వాదీప్‌‌‌‌‌‌‌‌ ను పట్టుకొని, 3.41 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, స్కూటీ, ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. లిఖిత్‌‌‌‌‌‌‌‌, హరికృష్ణ బెంగళూరు నుంచి డ్రగ్​తీసుకువచ్చి, స్వాదీప్‌‌‌‌‌‌‌‌ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలిపారు. అతన్ని అరెస్ట్​చేశామని, లిఖిత్, హరికృష్ణ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.