హైదరాబాద్‌‌‌‌ ఎఫ్‌‌‌‌సీ కోచ్‌‌‌‌పై వేటు

హైదరాబాద్‌‌‌‌ ఎఫ్‌‌‌‌సీ కోచ్‌‌‌‌పై వేటు

హైదరాబాద్‌‌‌‌ : ఇండియన్‌‌‌‌ సూపర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (ఐఎస్‌‌‌‌ఎల్‌‌‌‌) ఫ్రాంచైజీ హైదరాబాద్‌‌‌‌ ఎఫ్‌‌‌‌సీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ తంగ్బోయ్‌‌‌‌ సింగ్టోపై వేటు వేసింది. ఈ సీజన్‌‌‌‌లో హైదరా బాద్‌‌‌‌ ఆట తీరు బాగా లేకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆడిన 11 మ్యాచ్‌‌‌‌ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో సరిపెట్టిన హైదరాబాద్‌‌‌‌ పాయింట్ల పట్టికలో 12వ ప్లేస్‌‌‌‌లో ఉంది.

2020లో హైదరాబాద్‌‌‌‌ ఎఫ్‌‌‌‌సీలో అసిస్టెంట్ కోచ్‌‌‌‌, టెక్నికల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా జాయిన్‌‌‌‌ అయిన సింగ్టో జులై 2023లో హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా ప్రమోట్‌‌‌‌ అయ్యారు. ప్రస్తుతం అసిస్టెంట్‌‌‌‌ కోచ్‌‌‌‌గా పని చేస్తున్న శామిల్‌‌‌‌ చెంబకాత్‌‌‌‌కు తాత్కాలిక హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ బాధ్యతలు అప్పగించారు.  సింగ్టో హయాంలోనే హైదరాబాద్‌‌‌‌ ఎఫ్‌‌‌‌సీ.. ఆలిండియా జట్టుతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో నెగ్గి చరిత్ర సృష్టించింది.