హైదరాబాద్, వెలుగు: సిటీలో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. 100 చదరపు మీటర్లలో వ్యాపారం చేస్తున్న వారు ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఓ ప్రకటనలో బల్దియా అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, షాపుల వద్దకు ఏజెన్సీలు వచ్చి మంటలను ఆర్పే పరికరాన్ని ఫిట్టింగ్ చేయనున్నట్లు తెలిపారు.
ఆన్లైన్లో ఇలా అప్లయ్ చేయాలి
- ముందుగా www.ghmc.gov.in వెబ్ సైట్‌ను క్లిక్ చేసి fire mitigation/safety certificate సెలెక్ట్ చేయాలి. లేదా ఈ లింక్ https://firesafety.ghmc.gov.in/Login/Citizen_login ద్వారా లాగిన్ కావాలి.
- లాగిన్ అయిన తర్వాత తమ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
- అగ్ని ఆర్పే పరికరాల ఏజెన్సీ జాబితా నుంచి తమకు నచ్చిన ఎంపానెల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఒకవేళ టిన్ నంబర్ లేకపోతే షాప్ ఎస్టాబ్లిష్ మెంట్, అడ్రస్, సర్కిల్ లేదా
- జోన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఎంపానల్ ఏజెన్సీని సెలక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి.
- ఏజెన్సీ తమ షాపు వద్దకు వచ్చి ఫైర్ సేఫ్టీ పరికరాన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ చేసినట్టు వెబ్సైట్లో నమోదు చేస్తారు. తదుపరి ఫైర్ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఆ తర్వాత తమ అప్లికేషన్ స్టేటస్ రిపోర్టులో చూసుకోవచ్చు.
- జనరేట్ అయిన సేఫ్టీ సర్టిఫికెట్‌ను డౌన్ లోడ్ చేసుకొని షాప్‌లో డిస్ ప్లే చేసుకోవాలి.