ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికుల ప్రాణాలు నిలిచాయి.  హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌.. బస్సును ఆపేసి  ప్రయాణికులను దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

ALSO READ: రియల్టర్ కోసం కాల్వ దారి మళ్లింపు! పటాన్ చెరు తిమ్మక్క చెరువు కబ్జా

బస్సును ఆపేసిన డ్రైవర్..అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలు అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు కాలిపోయింది. అయితే  ఏసీలో మంటలు చెలరేగడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.  మంటల తీవ్రతకు బస్సు ముందు భాగం మొత్తం దగ్ధమైంది.