పార్సిగుట్ట కాలనీలు మునిగాయి.. బైక్స్, కార్లు కొట్టుకుపోయాయి..

పార్సిగుట్ట కాలనీలు మునిగాయి.. బైక్స్, కార్లు కొట్టుకుపోయాయి..

కుండపోత వర్షానికి జంట నగరాలు అల్లకల్లోలం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగాయి. వీటిలో పార్సిగుట్ట పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పార్సిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర, వినోభానగర్ కాలనీలు మోకాళ్ల లోతు నీటిలో ఉన్నాయి. 24 గంటలుగా ఇదే పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

2024, ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్నం నుంచి పడిన వర్షాలకు.. పార్సిగుట్ట ఏరియాలోని వీధులు నదులను తలపించాయి. రోడ్లపై ఉన్న బైక్స్, కార్లు కొట్టుకుపోయాయి. వినోభానగర్ లో వరద బీభత్సానికి.. ఓ వ్యక్తి కొట్టుకపోయాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు. 

పార్సిగుట్టలోని నాలుగు కాలనీల్లో.. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. వేలాది కుటుంబాలు ఇప్పుడు నీళ్లల్లోనే ఉన్నాయి. ఇంట్లోకి వచ్చిన నీటితో వస్తువులు అన్నీ తడిసిపోయాయి.. నిత్యావసరాలు అయితే నీళ్లల్లో కొట్టుకుపోయాయి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు బాధితులు. అర్థరాత్రి సమయంలో పడిన వర్షానికి పార్సిగుట్టలోని అన్ని కాలనీల్లోని ఇళ్లల్లోకి నీళ్లు రావటం.. వీధుల్లోనూ మోకాళ్ల లోతు నీరు ఉండటంతో.. ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

వర్షపునీటితోపాటు నాలాలు పొంగి.. మురికినీరు సైతం ఇళ్లల్లోకి రావటంతో వాసన భరించలేకపోతున్నారు స్థానికులు.